దసరా కి మరోసారి పోటీ పడబోతున్న చిరు – బాలయ్య

ఈ సంక్రాంతి కానుక గా వచ్చిన మన తెలుగు సినిమా ల లో మెగాస్టార్ చిరంజీవి గారి వాల్తేర్ వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ గారి వీర సింహ రెడ్డి రెండు సినిమా లు మంచి పాజిటివ్ టాక్ తో విజయాలు సాధించాయి,బాలకృష్ణ గారి వీర అభిమాని అయినా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో వచ్చిన వీర సింహ రెడ్డి జనవరి 12 న రిలీజ్ అయింది. మెగాస్టార్ గారి వీర అభిమాని అయినా బాబీ దర్శకత్వం లో వచ్చిన వాల్తేర్ వీరయ్య జనవరి 13 న రిలీజ్ అయింది. ఈ రెండిటి లో రెండు కామన్ గా ఉన్నాయి ,ఒకటి రెండిటికి నిర్మాత లు ఒకరే అవ్వడం, ఇంకోటి హీరోయిన్ శృతి హాసన్.

ఈ రెండు సినిమా లు సంక్రాంతి భరి లో దిగి మంచి విజయాలనే సాధించాయి,తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ అగ్ర హీరో లు మరో ఒక సారి తలపడనున్నారు మరి ఎప్పుడు ,ఏంటి ఆ సినిమా లు అనేది చూద్దాం.

వాల్తేర్ వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ అందుకున్న తర్వాత మెగాస్టార్ తన తదుపరి చిత్రం భోళా శంకర్ గా రాబోతున్నాడు,సినిమా షూటింగ్ మొదలు అయ్యి చాల రోజులు అయినప్పటికీ ఇంకా 70 % వరకు పూర్తికాలేదు అంటున్నారు చిత్ర వర్గాలు,దీనితో ఈ సినిమా దసరా కి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు,

నందమూరి బాలకృష్ణ తన తర్వాత సినిమా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఉంటుంది అని ఇది వరకే చెప్పారు,కథ కథ నాలు అన్ని ముందు గానే ప్రీ వర్క్ చేసి ఉన్నారు దర్శకులు,ఈ ఇద్దరి కలయిక లో సినిమా అనగానే భారి అంచనాలనే పెట్టి కుని ఉన్నారు అభిమానులు. అయితే ఇటీవల తారకరత్న మరణించిన నేపథ్యం లో బాలయ్య బాబు షూటింగ్ లోకి రావడానికి సమయం పడుతుంది అంటున్నారు. కొద్దిగా ఆలస్యం గా సెట్లో కి అడుగుపెట్టనున్నారు బాలయ్య,అయితే ఈ లోపు అనిల్ రావిపూడి ఇతర పనులు పూర్తి చేసందుకు ప్లాన్ చేస్తున్నారు,

సంగీతం ,బాక్గ్రౌండ్ మ్యూజిక్ ,పాటలు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి కేవలం బాలయ్య గారి పార్ట్ మాత్రమే పెండింగ్ ఉంచుతారు అంట,
బాలయ్య గారు షూటింగ్ లో కి అడుగు పెట్టగానే త్వరగా కంప్లీట్ చేయొచ్చు అని దర్శక ,నిర్మాతల ప్లాన్. అలా NBK 108 కూడా దసరా కె రిలీజ్ చేయాలి అని నిర్మాత లు ప్లాన్ చేస్తున్నారు,మరి చూడాలి మరో సారి ఈ అగ్ర హీరో ల మధ్య పోటీ ఎలా ఉంటుందో అని.

Leave a Comment